సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బాపట్ల వైపు వెళ్తున్న ఇండిక కారు వేగంగా ట్రాక్టర్ ను వెనకవైపు నుంచి ఢీ కొట్టింది దీనితో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో  ఇద్దరు సంఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగం అని తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


You Might Also Like