పదే పదే దగ్గుతున్నాడని  ఓ వ్యక్తిని అతడి స్నేహితుడే తుపాకీ తో కాల్చడం తో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది.గ్రేటర్ నోయిడాలోజరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం దయానగర్‌కు చెందిన ప్రశాంత్‌సింగ్ అలియాస్ ప్రవేశ్ (25), జై వీర్‌సింగ్ అలియాస్ గుల్లూ (30) ఇద్దరి మిత్రులు పక్కనే పక్కనే ఉన్న వ్యవసాయం చేస్తుంటారు. మంగళవారం రాత్రి ప్రశాంత్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి దయానగర్ ఆలయంలో లూడో ఆడుతున్నాడు.అదే సమయంలో అక్కడికి గుల్లూ రావడం తో  అతడిని చూసిన ప్రవేశ్ పదేపదే దగ్గడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయింది.తనను చూసి కావాలనే దగ్గుతున్నాడని గుల్లూ గొడవ రెచ్చిపోయి ప్రవేశ పైకి దాడికి దిగాడు.గొడవ ముదరడంతో ఆవేశం తో  గుల్లూ జేబులోంచి తుపాకి తీసి ప్రవేశ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రవేశ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You Might Also Like