( బుదారం శ్రీనివాస్ , వరంగల్ )


భయం తానూ చేసిన హత్య గురించి పోలీసులకు చెబుతారని భయం తో నిందితుడు తొమ్మిది హత్యలు చేసాడు.ఇది భయమా శాడిజమా అనేది అంతుపట్టకున్నా నిందితుడు మాత్రం  ఒక హత్యనుండి తప్పించుకోనేందుకు  మరో తొమ్మిది హత్యలు చేసాడు.అయితే ఈ పది హత్యలు కూడా నిద్రమాత్రలు ఇచ్చి వారు నిద్రలోకి జారుకున్నాకే చేయడం గమనార్హం. ఏదిఏమైనా  సంచలనం నృష్టించిన గీసుగొండ లోని గొర్రెకుంట పాడుబడ్డ బావిలో తొమ్మిది మంది హత్య కేసును వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు చేధించారని. లభ్యమైన తొమ్మిది మంది మృతదేహాలను హత్యచేసి బావిలో వడవేసినట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

నిందితుడి వివరాలు:

సంజయ్‌ కుమార్‌ యాదవ్‌, నుర్లపూర్‌ గ్రామం, బిగుసరయి జిల్లా, బీహర్‌ రాష్ట్రం, తండ్రిపేరు

వవన్‌రాం, వయన్సు 24. ప్రస్తుత నివాసం జాన్‌పాక, గీసుగొండ మండలం

మృతుల వివరాలు:

1. మహమ్మద్‌ మక్సూద్‌ ఆలం, తండ్రిపేరు మక్పూల్స్‌ వయన్సు 47,శాంతినగర్‌, కరీమాబాద్‌, వరంగల్‌

2.మహామ్మద్‌ నిషా ఆలం, భర్తపేరు మక్సూద్‌ ఆలం, వయన్సు॥0,శాంతినగర్‌, కరీమాబాద్‌, వరంగల్‌

3.మవామ్మద్‌ బుఘ్రా కాటూన్‌, వయన్సు 20,శాంతినగర్‌, కరీమాబాద్‌, వరంగల్‌ ఆర్బన్‌

4&.బిబ్లూ, వయన్సు 3నంవత్సరాలు

5.మవామ్మద్‌ షాబాజ్‌, తండ్రి మక్సూద్‌ ఆలం, వయన్సు 19,శాంతినగర్‌, కరీమాబాద్‌, వరంగల్‌

6.మవామ్మద్‌ నూహేల్క్‌ తండ్రి మక్సూద్‌ ఆలం, వయన్సు 18,శాంతినగర్‌, కరీమాబాద్‌, వరంగల్‌

7.శ్యాం కుమార్‌ షా, తండ్రి లక్ష్మన్‌ షా, వయన్సు 18, మంజులావూర్‌, లక్సోబీవోర్‌ రాష్ట్రం.

8.శ్రీరాం కుమార్‌ షా, తండ్రి రామేశ్వర్‌ షా, వయన్సు, 21, జగ్‌మొహర్‌ ,నమన్తవూర్‌ జిల్లా, బీహార్‌

9.మహమ్మాద్‌ వకీల్మ్‌ తండ్రి రోహిత్‌ వయన్సు 38,శాంతినగర్‌, కరీమాబాద్‌, వరంగల్‌ ఆర్బన్‌

నుర్లపూర్‌ గ్రామం, బిగుసరయి జిల్లా, బీహర్‌ రాష్ట్రం,

 ప్రస్తుతం జాన్‌పాక గ్రామంలో నివాసం వుంటున్నసంజయ్‌ కుమార్‌ యాదవ్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.కమిషనర్ రవీందర్ మీడియాకు తెలిపిన వివారాలు ప్రకారం 

గత ఆరు సంవత్సర క్రితం జీవనోపాధి కొసం వరంగల్‌ చేరుకున్న నిందితుడు సంజయ్‌ కుమార్‌ రామ్‌ మీల్స్‌ కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనేసంచులు తయారీ కేంద్రం పనిచేసేవాడు. ఇదే కేంద్రంలో పనిచేస్తూన్న మృతి చెందిన మక్సూద్‌ ఆలం కుటుంబ సభ్యులతో నిందితుడు సంజయ్‌కి పరిచయం అయింది. ఇదే సమయంలో మక్పూద్‌ భార్య నిషా అక్క కూతురు పశ్చిమ బెంగాల రాష్ట్రానికి చెందిన రఫికా వయస్సు 37తో కుడా నిందితుడుకి పరిచయడం కావడం జరిగింది.

క్రమ క్రమంగా నిందితుడు రఫికాతో పరిచయం పెరగడంతో రఫీకాకు దబ్బు ఇచ్చి ఆమే ఇంటిలోనే భోజనం చేసేవాడు. ఇదే సమయంలో భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా వున్న రఫీకాకు నిందితుడు సంజయ్‌ మరింత దగ్గర కావడంతో పాటు, కొద్ది రోజుల అనంతరం నిందితుడు రఫీకాను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గీసుగొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో నూతనంగా రెండుగదుల ఇంటిని కిరాయి తీసుకోని రఫీకా మరియు ఆమె ముగ్గురు పిల్లలతో కల్సి గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం కోనసాగిస్తున్నాడు.

ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెతో నిందితుడు చనువుగా ఉండడాన్ని ప్రయత్నిస్తున్న సందర్చాన్ని గమనించిన రఫీకా నిందితుడు సంజయ్‌తో పలుమార్లు గోడవపడటం జరిగింది. అయిన కుడా నిందితుడు సంజయ్‌ తన పద్దతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా రఫీకా కుమార్తెతో వ్యవహరిస్తుండంతో తనను పెళ్ళి చెసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా బెదిరించడంతో, నిందితుడు రఫీకాను అడ్డు తోలిగించుకోవాలని నిర్ణయించుకోవడం కు తమ పెళ్ళి విషయాన్ని బంధువులతో ముచ్చటించేందుకుగా పశ్చిమ బెంగాల్‌కు వెళ్తామని రఫీకాను మాత్రమే తీసుకోని గత మార్చ్‌ 6వ తారీఖున విశాఖపట్నాంవైపు వెళ్లే గరీభ్‌రథ్‌ టైన్‌ ద్వారా వరంగల్‌ నుండి  రాత్రి వది గంటలకు బయలుదేరి వెళ్ళారు. నిందితుడు ట్రైన్‌లో ప్రయాణించే మార్గంలో మజ్డిగ ప్యాకేట్లను కోనుగోలు చేసి తనతో తెచ్చుకోన్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫికాకు అందించడం జరిగింది.

నిద్రమాత్రలు వున్న మజ్జిగ తాగిన రఫీకాతో నిందితుడు సంజయ్‌ టైన్స్‌ పుట్‌బోర్డ్‌ వద్ద కూర్చోని ముచ్చుటించు కున్నారు.సుమారు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిడువ్రోలు వద్ద ప్రయాణికులు అందరు నిద్రపోతున్న సమయం లో  నిందితుడు తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం మత్తులో వున్న రఫీకాను ఆమె చున్నీతోనే గోంతు బిగించి చంపి టైన్‌ నుండి తోసివేసాడు. దీనికి సంబందించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది) రఫీకా చనిపోయిందని నిర్భ్ధారించుకోన్న అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దిగి తిరిగి మరో రైలులోనిందితుడు వరంగల్‌కు చేరుకున్నాడు.వరంగల్‌కు చేరుకున్న నిందితుడు రఫీకా పశ్చిమ బెంగాల్‌ లోని తమ బంధువులు ఇంటికి వెళ్ళినట్లుగా రఫీకా పిల్లలను నమ్మించాడు.

కొద్ది రోజుల అనంతరం తన అక్క కుతూరు రఫీకా తమ బంధువుల ఇండ్లలో లేదని,రఫీకా ప్రస్తుతం ఎక్కడ వుందని మరణించిన మక్సూద్‌ ఆలం భార్య నిషాఆలం నిందితుడుని గట్టిగా అగడంతో పాటు, పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించ సాగింది.దీనితో కంగుతున్న నిందితుడు ఏదోవిధంగా పోలీసులకు చిక్కుతానని భయపడి మక్సూద్‌ ఆలం, భార్య నిషాఆలంను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళికను రూపోందించుకున్నాడు.

ప్రణాళికను అమరులు పర్చడంలో భాగంగా గత 16తారీకు నుండి 2౦వ తారీఖు వరకు నిందితుడు మక్సూద్‌ మరియు అతని కుటుంబ గోరైకుంటలోని పనిచేస్తూన్నగోనేసంచులు తయారీ గోదాంకు రోజు క్రమం తప్పకుండా వస్తుపోతున్న సమయంలోనే నిందితుడు గోదాం చూట్టు ప్రక్కల పరిసరాలను కూడా పరిశీలించేవాడు. చివరకు మక్సూద్‌ ఆలం, భార్య నిషాఆలంను చంపి గోదాం ప్రక్మనే వున్న పాడుపడ్డబావి పడవేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు ఈ నెల 20తారీకు మక్సూద్‌ మొదటి కూమారుడైన షాబాజ్‌ ఆలం పుట్టిరోజు అని తెలియడంతో ఆదే రోజు చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకోసం ఈ నెల 18వ తేది నిందితుడు వరంగల్‌ చౌరస్తాలోని ఓ మెడికల్‌ షాపులో సూమారు 60కి పైగా నిద్రమాత్రలు కోనుగోలు చేశాడు.అనుకున్న పథకం ప్రకారం నిందితుడు ఈ నెల 20వ తేదిన రాత్రి 7.30గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకోని మృతులతో చాలా సేవు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా వున్న సమయంలో నిందితుడు మృతులకు తెలియకుండా మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంతో పాటు, మృతులైన శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలో కూడా వారికి తెలియకుండా నిందితుడు తనతో పాటు తేచ్చుకున్న నిద్రమాత్రలు కలిపాడు.

మరణించిన మక్సూద్‌ తన భార్య నిషా ఆలం, కూతురు బుష్షా కాటూన్‌, కుమారులు షాబాజ్‌ ఆలం, సుహేల్‌ ఆలం, మనుమడు మరియు ఇదే గోదాంలో నివాసం వుంటున్న శ్యాం, శ్రీరాం, మహమ్మద్‌ షకీల్‌ నిందితుడు నిద్రమాత్రలు కలిపిన భోజనం చేయడంతో మృతులందరు మత్తులోకి జారుకోవడంతో నిందితుడు సాక్ష్యం లేకుండా వుందాలనే అలోచనతో మత్తులో వున్న అందరిని చంపాలని నిర్ణయించుకోని సూమారు ఆర్థరాత్రి 12.30 నుండి ఉదయం 5గంటల మధ్య సమయంలో నిందితుడు మత్తులో వున్న తొమ్మిది మందిని గోదాం ప్రక్కనే వున్న పాడుపడ్డ బావి వద్దకు తరలించి బావిలో పడివేసి అందరు చనిపోయారని నిర్ధారించుకోన్న అనంతరం నిందితుడు మృతుల గదుల నుండి వాల్‌ మార్ట్‌లో కోనుగోలు చేసిన కిరాణ సామానుతో పాటు వారి సెల్‌ఫోన్ల తీసుకోని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు.


ఈ సంఘటనపై గీసుగొండ పోలీసులు కేసును నమోదు చేసుకోవడంతో పాటు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు 6 ప్రత్యేక దర్యాప్తులు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బృందాలు నిర్వహించిన దర్యాప్తులో గోదాం మరియు గోరైకుంట ప్రాంతంలోని సి.సి కెమెరాలను దృష్యాలను అధారంగాచేసుకోని నిందితుడిని గుర్తించిన దర్యాప్తు బృందాలు ఈ రోజు మద్యాహ్నం 130సమయంలో జాన్‌పాక్‌లోని తనఇంటిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించడంతో నిందితుడు తాను పాల్పడిన నేరాలను పోలిసుల ఎదుట అంగీకరించాడు.


ఈ సంఘటనపై గీసుగొండ పోలీసులు కేసును నమోదు చేసుకోవడంతో పాటు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు 6 ప్రత్యేక దర్యాప్తులు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బృందాలు నిర్వహించిన దర్యాప్తులో గోదాం మరియు గోరైకుంట ప్రాంతంలోని సి.సి కెమెరాలను దృష్యాలను అధారంగాచేసుకోని నిందితుడిని గుర్తించిన దర్యాప్తు బృందాలు ఈ రోజు మద్యాహ్నం 1:30 సమయంలో జాన్‌పాక్‌లోని తనఇంటిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించడంతో నిందితుడు తాను పాల్పడిన నేరాలను పోలిసుల ఎదుట అంగీకరించాడు.

కేసులో చేధించడంలో శ్రమించిన ఈస్ట్‌ఇంచార్జ్‌ డి.సి.పి వెంకటలక్ష్మీ మామూనుూర్‌ ఎ.సి.పి శ్యాంసుందర్‌,గీసుగొండ ఇన్స్‌స్పెక్టర్‌ శివరామయ్య, పర్వతగిరి ఇన్స్‌స్పెక్టర్‌ కిషన్‌, టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌ క్రైం, ఐటీకోర్‌,సి,సి.ఎస్‌ టీం ఇన్స్‌ స్పెక్టర్లు నందిరాంనాయక్‌, జనార్థన్‌ రెడ్డి రాఘవేందర్‌, రమేష్‌కుమార్‌తో పాటు వారీ సిబ్బందిని వరంగల్‌  పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు 

You Might Also Like