ఉత్తరాఖండ్ లోని ప్రధానమైన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటైన బద్రీనాథ్ దేవాలయం తలుపులు శనివారం తెరిచారు.గత కొంత కాలం గా లాక్ డౌన్ తో భక్తుల ప్రవేశం పై అనుమతి నిరాకరించిన ఈ దేవాలయాన్ని తెల్లవారు జామున 4:౩౦ గంటలకు సిబ్బంది తెరవగా ఆలయ అర్చకులు  ప్రత్యేక పూజలతో సేవలు ప్రారంభించారు.

ప్రజాశ్రేయస్సు కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు . దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా కొద్దీ మంది భక్తుల సమక్షంలో ఈ కార్యాన్ని నిర్వహించారు.శీతాకాలంలో మంచు ప్రభావం తో ఆరు నెలల పాటు ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు .ఈ నేపత్యంలో దేవాలయాన్ని తెరిచి భౌతిక దూరం తో భక్తుల అనుమతికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

You Might Also Like