ఢిల్లీ:పూరి జగన్నాథ్ రధయాత్రని ఈ ఏడాది నిర్వహించవద్దని ఆదేశించిన సుప్రీమ్ కోర్ట్ తమ ఆదేశాలను 

పునఃసమీక్షించింది.రథయాత్రకు అనుమతి ఇస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.షరతులతో కూడిన

అనుమతినిచ్చిన సుప్రీమ్ కోర్ట్ పూర్తి బాధ్యత వహించాలని ఒరిస్సా ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేవలం

పూరి లోనే రథయాత్ర నిర్వహించాలని,ప్రజలకు అనుమతిలేదని తేల్చిచెప్పింది.భక్తులు లేకుండా కరోనా

ఆంక్షలతో పూరి జగన్నాథ రథయాత్ర నిర్వహించుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర

ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీమ్ కోర్ట్ కి తెలిపాయి.జగన్నాథ రథయాత్ర నిలిపివేయాలని జూన్ 18 న 

ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర,ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలువురు 

సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించారు.దీనిపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్,చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబడే నేతృత్వంలో

త్రిసభ్య ధర్మాసనం నాగపూర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టి ఉత్తరువులు జారీచేసింది.


You Might Also Like