వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రీ  భూనీలా సమేత లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం బుధవారం  ఉదయం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ తంతును  వైష్ణవ అర్చకులు రామాచార్యా,దామోదరా చార్య,విజయ సింహ చార్య,వెంకట చార్య లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలను ,అభిషేకాలను అర్చక స్వాములు నిర్వహించారు.కన్యాదాతలుగా రాచకొండ దేవేంద్రాచార్య  ఉషశ్రీ లు వ్యవహరించారు.కళ్యాణం అనంతరం కల్యాణ మూర్తులను భక్తులు దర్శించుకుని తరించారు.


You Might Also Like