వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవం గా జరుగుతున్నాయి.కల్యాణోత్శవం లో భాగం  ఆదివారం ధ్వజారోహణం జరిగింది. అష్ట దిక్పాలకులు, బ్రహ్మ, విష్ణు మహేశ్వర సమస్త దేవత గణాన్ని ఆహ్వానిస్తూ అర్చకులు ఈ సందర్భంగా ఆవాహన జరుపుతున్న తీరు ,ఆలయం లో జప హోమ అర్చన అభిషేకములు కన్నుల పండుగగా జరిగాయి. ఈ  కార్యక్రమాలు వరంగల్ నగర ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రాజు కరాని, వర్షా కరాని దంపతుల సౌజన్యంతో జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ ,సిబ్బంది పాల్గొన్నారు.


You Might Also Like