ఈ మధ్యకాలంలో నడుమునొప్పి అనేది సర్వసాధారణమైపోయింది. దురదృష్టమేమంటే వెన్ను నొప్పి సమస్య ఇప్పుడు విపరీతంగా విస్తరించిపోతోంది. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ దాదాపు అందర్నీ భాధిస్తోంది.ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్లో మనం వెన్నును చాలా ఒత్తిళ్లపాలు చేస్తున్నాం. అస్సలు ఒంటికి వ్యాయామం లేకుండా గంటల తరబడి టీవీలూ, కంప్యూటర్ల ముందు కూర్చోవటం నుంచి నిరంతరం ఉరుకుల పరుగుల జీవనశైలి వరకూ.. ప్రతిదీ నడుము మీద తీవ్రమైన ఒత్తిడి పెంచేదే.బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి హాట్ అండ్ కోల్డ్ థెరఫీలు గొప్పగా సహాయపడుతాయి. అయితే వెన్ను నొప్పి ఉన్న ప్రదేశంలో హాట్ అండ్ కోల్డ్ థెరఫీలను ప్రయత్నిస్తే తప్పకుండా నొప్పి తగ్గుతుంది. కండరాలు వదులై, వాపులు తగ్గడం వల్ల క్రమంగా వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది.


You Might Also Like