వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తరువాత స్కిన్ టాన్ అవ్వడం, చర్మం కమిలిపోవటటం, రాషెస్ వంటి సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా మీ చర్మం సున్నితంగా ఉంటే మరిన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సున్నితమైన చర్మానికి చక్కటి పరిష్కారం విటమిన్ ఇ. మీరు వడదెబ్బకు గురైతే, విటమిన్ ఇ నూనె మీకు ఉపశమనం ఇస్తుంది. చర్మం తేమగా లేకపోతే విటమిన్ ఇ ఆయిల్.. డ్రై స్కిన్‌ కొరకు వాడొచ్చు. వడదెబ్బ ఫలితంగా మీ చర్మం కమిలిపోవటం, దురద వస్తే మీరు విటమిన్ ఇ నూనెను వింటర్ క్రీమ్‌తో కలపడం ద్వారా ఉపయోగించొచ్చు. అందుకే ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ రాసుకొని వెళ్లడం మంచిది

You Might Also Like