మర్కజ్ ప్రార్థనల పుణ్యమా అని భారత్‌లో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 508 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,789కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 353 మంది డిశ్చార్జ్‌ కాగా, 124 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 868, తమిళనాడులో 621 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఇటు తెలంగాణ లోకూడా వైరస్ ఘణనీయం గా వ్యాపిస్తుంది.ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి తో ఈ వ్యాధి వ్యాపించి దేశ వ్యాప్తం గా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వీటి పరిష్కరానికి లాక్ డౌన్ కొనసాగింపే పరిస్కారం గా కేంద్రం భావిస్తుంది.

You Might Also Like