కరోనా వైరస్ ప్రబలుతుండటం తో  అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమౌతోంది. వైరస్ దారికి అల్లాడుతున్నఆ అమెరికా లో కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా సహా ప్రపంచపటంలో ఉన్న అన్ని దేశాల్లో సంభవిస్తోన్న మరణాలు కంటే  అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న మరణాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో కరోనా మృతుల సంఖ్య నమోదు కావడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి. వెయ్యికి పైగా మరణాలు నమోదైన దేశాలు ఇప్పటిదాకా ఒక్కటీ లేదు.అగ్ర రాజ్యం అమెరికా లో మాత్రమే మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించిందే జరిగింది. వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమంటూ ఆయన పడుతున్న ఆందోళన,  కరోనా వైరస్ వల్ల రెండు లక్షల మంది మరణించే అవకాశం ఉందంటూ ఆ దేశ అధికారులు వేసిన లెక్కలు నిజమయ్యేలా ఉన్నాయి.అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజే 1169 మంది కరోనా వైరస్‌కు బలి కావడమే ఇందుకు నిదర్శనం.

అమెరికాలో ని 27 రాష్ట్రాల్లో అంటే ఆదేశం లోని అన్ని రాష్ట్రాలలో  కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిచిగాన్ రాష్ట్రాల్లో అయిదంకెలను ఎప్పుడో దాటేశాయి. ఒక్క న్యూయార్క్‌లోనే 93,053 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చూస్తే న్యూయార్క్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను అందుకోవడానికి ఎంతో సమయం పట్టదు. న్యూయార్క్‌లో కరోనా బారిన పడి ఇప్పటికే 2538 మంది మరణించారు. అమెరికాలో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రం న్యూయార్క్‌ .కాగా న్యూయార్క్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా మారింది న్యూజెర్సీ. ఈ రాష్ట్రంలో 25,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా 537 మంది మరణించారు. కాలిఫోర్నియా-11,027, మిచిగాన్-10,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. లూసియానా, ఫ్లోరిడా, మసాచ్చుసెట్స్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్క్‌ను అందుకోవడానికి ఇంకా ఎంతో  సమయంపట్టక పోవచ్చు.

మొత్తనికి అమెరికా అధ్యక్షుడు చెప్పినట్లు కరోనా వైరస్ వల్ల రెండు లక్షల మంది మరణించే అవకాశం ఉందంటూ ఆ దేశ అధికారులు వేసిన లెక్కలు నిజమయ్యేలా ఉన్నాయి.దేశం లో న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో మరణాల సంఖ్య అత్యధికంగా ఉండటానికి ప్రధాన కారణం సరైన వైద్య పరికరాలు లేకపోవడమేనని తెలుస్తోంది. వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో చూస్తూ, చూస్తుండగానే కరోనా బాధితులు ప్రాణాలను వదిలేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,000లను దాటేసింది.అన్ని హంగులుండి అగ్ర రాజ్యం గా పిలువా బడే అమెరికా లోనే ఈ పరిస్థితి ఇలా ఉంటె మిగతా దేశాలలో ఎలా ఉంటుందో అంచనా వేయడమే కష్టమవుతుంది.


You Might Also Like