అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనా మీద తన మీద తన అక్కసును వెళ్లగక్కారు.వైరస్ ను గుర్తించి సకాలంలో చైనా  కరోనా వైరస్‌ను అదుపు చేయక పోవడం తోనే ప్రపంచం లో 184 దేశాలు కరోనా తో నరకం అనుభవిస్తున్నాయని ట్రంప్  ఆవేదన వ్యక్తం చేశారు.ఇది నమ్మడానికి ఇబ్బందిగా ఉన్న ఇదే నిజం  అని ఆయన  మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కరోనా కల్లోలానికి పరిహారంగా జర్మనీ 140 బిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తున్నది. అమెరికా అంతకంటే ఎక్కువ పరిహారం డిమాండ్ చేస్తుందని ట్రంప్ సూచించారు. చైనా తొలిదశలోనే వైరస్ గురించిన సమాచారాన్ని ప్రపంచ దేశాలతో పంచుకుంటే ముప్పు తగ్గేదని అమెరికా, బ్రిటన్, జర్మనీ నేతలు భావిస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని, చైనా నుండి నష్ట పరిహారం డిమాండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌పై వత్తిడి తెస్తున్నారు.వాళ్ళ ఒత్తిడి తోనే ట్రంప్ చైనా పై ఆగ్రహం వ్యక్తం చేయడం  విశేషం.

You Might Also Like