జాతుల నడుమ జరుగుతున్నా పోరులో కాంగోలో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. కాంగో లోని తూర్పు ప్రాంతంలో వేర్వేరుగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో 30 మంది వరకు మృత్యు వాత పడ్డారు.  కోలి గ్రామ ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి వేళ కోడెకో వర్గానికి చెందిన దుండగులు దాడికి దిగి పడుకున్నవారిని పడుకున్నట్లుగానే కాల్చివేశారు. మృతులంతా హేమ జాతికి చెందినవారే కావడం తో ఇది జాతుల మధ్య పోరుగా వారు భావిస్తున్నారు. కాగా, బేనిలో జరిగిన మరో దాడిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు సహా అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌ (ఏడీఎఫ్‌) మిలిటెంట్‌ వర్గానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. 1999 నుంచి ఇక్కడ రెండు వర్గాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది.ఈ వర్గ పోరులో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

You Might Also Like