ప్రపంచ వ్యాప్తం గా కోవిద్ తో పిట్టల్లా రాలుతున్నవాగారిని చూసి భయపడుతున్న  జనాలకు ఇది ఇది నిజం గా శుభవార్తనే .కరోనా వైరస్‌ కు విరుగుడు మందు తయారవుతోందా అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో కరొనకు అంటి డాట్ తయారీకి పరిశోధనలు ఆరంభించారు. ట్రయల్స్‌ సైతం మొదలయ్యాయి. ఒక వేళా తయారయిన వచ్సినే మార్కెట్ లోకి రావాలంటే ర్ని రోజులు పడుతుంది .మందులు లేక ఈ వ్యాధి తో మరణించడమే నా అనికుంటున్న  తరుణంలో ఆస్ట్రేలియాలోని మోనాష్‌ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రజలకు ఊరట కలిగిస్తోంది.


మోనాష్‌ వర్సిటీ పరిశోధకుడు కైలీ వాగ్‌స్టఫ్‌మాట్లాడుతూ  పరాన్న జీవుల నుంచి సంక్రమించే వ్యాధులు నయం చేసేందుకు ఉపయోగించే యాంటీ పారాసైటిక్‌ డ్రగ్‌ ‘ఐవర్‌మెక్టిన్‌’  నావెల్‌ కరోనా వైరస్‌ను పూర్తిగా నాశనం చేస్తోందని  తెలిపారు. ఇది  కరోనా సూక్ష్మక్రిమిని 48 గంటల్లో చంపేస్తోందని వారి పరిశోధనల్లో తేలిందట.ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ డ్రగ్‌తో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపితే కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగపడగలదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని యాంటీవైరస్‌ రీసెర్చ్‌ జర్నల్‌లో వారు  ప్రచురించారు.


‘కేవలం ఒక్క డోస్‌ 48 గంటల్లోనే వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ అణువులన్నిటినీ తొలగించడాన్ని మేం గుర్తించాం. 24 గంటల్లోనే వైరస్‌ తగ్గుదల కనిపించింది’ అని వాగ్‌స్టఫ్‌ అన్నారు. ఐవర్‌మెక్టిన్‌ ఆమోదిత యాంటీ పారాసైటిక్‌ డ్రగ్‌ అని ఆయన తెలిపారు. గాజుగొట్టం (విట్రో)లో హెచ్‌ఐవీ, డెంగీ, ఇన్‌ఫ్లుయెంజా, జికా వైరస్‌పైనా ఇది బాగా పనిచేసిందని వెల్లడించారు. పరిశోధన గాజు గొట్టంలోనే చేశాం కాబట్టి మానవులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాల్సిన అవసరం ఉందన్నారు.‘ఐవర్‌మెక్టిన్‌ విస్తృతంగా ఉపయోగిస్తున్న సురక్షితమైన డ్రగ్‌. ప్రస్తుత డోస్‌లు మానవులపై ప్రభావవంతంగా పనిచేస్తాయో లేదో మేం గుర్తించాల్సి ఉంది. తర్వాతి అడుగు అదే. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి మందు లేనప్పుడు అందుబాటులో ఉన్నవాటిపై పరిశోధన చేస్తే ప్రజలకు త్వరగా సాయం అందుతుంది’ అని ఆయన అన్నారు.మొత్తానికి కరోనాకు మందు కనిపెట్టడం తో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

You Might Also Like