అదుపులో ఉన్న దనుకున్న కరోనా వైరస్  అంతకంతకు వేగం గా వ్యాప్తిచెందుతుంది.ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే భారత దేశంలో కరోనా మహమ్మారి  ప్రజలపై పంజా విసురుతుంది.లాక్ డౌన్ ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటూ ఎంత ప్రయత్నించినా కొందరి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల ముడా నమ్మకాల వల్ల వారి ప్రయత్నం నిష్ప్రయోజనమవుతుంది. ఫలితంగా గత 12 గంటల్లో దేశంలో 240 కొవిడ్‌-19 కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ప్రకటన చేసింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,637కు చేరిందని తెలిపింది. ఇందులో 1,466 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 133 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.


తెలంగాణలో 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 87 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 43 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారే. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ పరీక్షించేందుకు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు.కొందరు ఇంకా అధికారులకు అందు బాటులోకి  రాకుండా తిరుగుతున్నందున వాళ్ళ ద్వారా వ్యాధి ప్రబలే అవకాశముంది.ఏప్రిల్ 14  వరకు కరోనా ను అదుపులోకి తెచ్చెదుకు ప్రయత్నిస్తున్న మోడీ సార్కార్ కు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి.ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సర్కార్ మరిన్ని కఠిన చర్యలు తీసుకోనైనా వ్యాధిని అడ్డుకునేందుకు ప్రయత్నించాలనుకుంటుందా గా ఆ చర్యల వల్ల ప్రజలకు మరింత ఇబ్బంది కలిగే అవకాశముంది.

You Might Also Like