పరిస్థితులనుకూలంగా మెదలకుండా  ఇష్టరాజ్యం గా వ్యవహరిస్తూ  మర్కజ్ నిజాముద్దీన్ లోప్రార్థనలు జరిపిన  వారందరు తాలిబన్లతో సమానమని వారిని అల్లా కుడా క్షమించడు అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఘాటుగా విమర్శించాడు. ఢిల్లీలోని జిమాముద్దీన్ తబ్లిగ్ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ఈ నెల13 నుంచి 15 వరకూ నిజాముద్దీన్ లో తబ్లిగ్ జమాత్ సమావేశాలను నిర్వహించడం తాలిబన్లు చేసిన నేరాలతో సమానమని ఆయన పేర్కొన్నారు.  దేశంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మైనారిటీలతో సహా ప్రజలు మద్ధతు ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దేశం కరోనా వైరస్ పై పోరాడుతున్న వేళ తబ్లిగ్ జమాత్ సమావేశాలు నిర్వహించడం క్షమించరాని నేరమని  అల్లా  కూడా దీన్ని క్షమించడని ముక్తార్ అబ్బాస్ నక్వి పేర్కొన్నారు.  కరోనావ్యాప్తి నిరోధానికి శుక్రవారం నమాజ్ మసీదుల్లో చేయరాదని,  ముస్లిములందరూ స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారని, అలా జమాత్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేసుకోలేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు.దీని వల్ల కట్టడి చేయాలనుకున్న కరోనా ప్రబలి తీవ్ర ప్రాణనష్టం వచ్చే అవకాశముందని ఆయన అనడం గమనార్హం 


 

You Might Also Like