కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మోడీ సర్కార్ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎవరు ఇళ్ల నుండి బయటకు రాకపోవడంతో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది.రెక్కాడితేగాని డొక్కడని పేదలకు తినడానికే కష్టంగా ఉండగా నెలవారి చెల్లింపులు భారంగా మారాయి. దీనిాని గ్రహించిన ఆర్బిఐ నిన్న రుణాల చెల్లింపులు మూడు నెలలు తరువాత చెలి్లంచాలని కోరగా నేడు  విద్యుత్‌ మంత్రిత్వశాఖ సాధారణ ప్రజలకు సహాయ ప్యాకేజీని ప్రకటించే యోచనలో ఉంది. వచ్చే మూడు నెలలు విద్యుత్‌ బిల్లులు చెల్లించడంలో ఆలస్యమైనా జరిమానా మినహాయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరీ సంస్థ ఈరోజు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది.దీనిపై గత రెండ్రోజులుగా విద్యుత్‌ శాఖ అధికారులతో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ కసరత్తు చేస్తున్నట్లు ఈ మేరకు అధికారంగా నేడో రేపో ప్రకటన వెలువరించే అవకాశముంది.

You Might Also Like