కుక్కలు పండులు పాములు ఎలుక పిల్లలు గబ్బిలాలు ఒక మనిషిని తప్ప అన్ని తినే చైనాకు కరోనా వైరస్ దెబ్బతో కనువిప్పయింది. ఆ దేశ ప్రజల్లో ఒక్కసారే మార్పు కనపడుతుంది.ప్రభుత్వం లో కూడా కలయిక మొదలయింది.మొత్తానికి దేశంలో తొలిసారి షెన్‌జెన్ నగరంలో కుక్కలు, పిల్లుల మాంసం తినడాన్ని నిషేధించింది. మే ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. కొత్త చట్టం ప్రకారం పిల్లులు, కుక్కలు, పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులు తినడం నిషేధం. అలాగే, వాటి పెంపకం, విక్రయాలను కూడా నిషేధించినట్టు ప్రభుత్వం పేర్కొంది.అయితే వూహాన్‌లో జంతువధశాల కేంద్రంగా ప్రాణాంతకమైన కరోనా   వైరస్ పురుడుపోసుకున్న నేపథ్యంలో తైవాన్, హాంకాంగ్‌లో ఇప్పటికే కుక్కలు, పిల్లుల మాంసంపై నిషేధం అమల్లో ఉంది.


కరోనా వైరస్ ప్రబలి ప్రపంచం మొత్తం దాని బారినపడడానికి గల కారణాల్లో వీటి మాంసం తినడం కూడా ఒకటన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 1.50 లక్షల యువాన్ల భారీ జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.అయితే, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలు తదితర వాటికి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు లభించింది. ఇప్పటికైనా చైనాలో కొన్ని నగరాల్లో  వచ్చిన  మార్పు మాంసాహార విషయం లో ఆ దేశం లోని మిగతా ప్రాంతాలకు  కనువిప్పు కావలి.

You Might Also Like