లడఖ్ లో భారత్ చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన సడలుతోంది .కాల్విన్ లోయ సహా మరో మూడు ప్రాంతాలనుండి ఇరుదేశాల సైన్యాలు కొంతమేర వెనక్కి తగ్గాయి.2017 డోక్లామ్ ప్రతిష్టంభన తరవాత గత 40 రోజులుగా లడఖ్ లో ప్రతిష్టంభన కొనసాగుతుంది .పాంగోంగ్ సరస్సు దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ తో మొదలైన ప్రతిష్టంభన గాల్వన్ లోయ వింఛుక్ వంటి మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది .ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యకు పరిష్కారం కోసంమేజర్ జనరల్ స్థాయి సమావేశాలు జరిగిన ఫలితాలు కనిపించకపోవడంతో గత శనివారం లెఫ్టీనంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి .ఈ చర్చచల తరువాత సానుకూల పరిణామాలు కనిపించాయి.సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని రెండు దేశాలు వేరువేరుగా ప్రకటనలు జారీ  చేసాయి.మరోసారి ఈవారంలో బెట్టాలియన్ కమాండర్ స్థాయి సమావేశాలు జరగాల్సిన తరుణంలో చైనా సైన్యం రెండున్నర కిలోమీటర్లు వెనక్కి వెళ్లగా భరత్ సైన్యం కూడా కొంత మేర వెనక్కి వచ్చింది దీంతో చర్చల ముందు సుహృద్భావ వాతావరణం ఏర్పడినట్టేనని భావిస్తున్నారు.అయితే సమస్యకు ప్రధాన కారణమైన పాంగోంగ్ సరస్సు దగ్గర ప్రతిష్టంభన కొనసాగుతుంది.ఇక్కడ అస్పష్టమైన సరిహద్దులు ఉండడంతో వివాదానికి కారణం అయింది ఈసారి చేర్చలు ప్రధానంగా పాంగోంగ్ సరస్సు చుట్టూ తిరుగుతాయని భావిస్తున్నారు. 

You Might Also Like