కోటి 60 లక్షల జనాభా నిత్యం రద్దీ తో కళకళ లాడే ఆ నగరం 76  రోజులుగా మూగపోయింది.భయంకరమైన వైరస్ ప్రబలడం తో జనాలు అస్వస్తతకు గురై ఇండ్లకే పరిమితమయ్యారు.వైరస్ భయంతో ప్రాణాలమీద ఆశ వదిలి బితుకు బితుకు మంటూ బ్రతికారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించడం తో మరణ మృదంగం మ్రోగిన ఆ నగరం లో గత 6  గంటలుగా జనాల కదలిక ,బయటకు వస్తున్నా ప్రజల్లో భయం తో కూడిన సంతోషం వారి మొహాల్లో కనబడుతుండగా  చచ్చి మల్లి పుట్టామా అన్నట్లు గా ఆ ప్రజల్లో ఎదో ఆశ మొత్తానికి చైనా లోని వుహాన్ నగర జీవన స్థితి ఇది. 

కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్‌లో పరిస్థితులు కుదుట పడ్డాయి.వైరస్ వ్యాప్తికి కారకమైన వుహాన్ లో కరోనా పాజిటివ్‌ కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ మొదట వ్యాపించింది లోనే. జనవరి 23న చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ విధించింది. ఆ తర్వాత హుబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది. ఎట్టకేలకు 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. ఇప్పుడు వుహాన్ ప్రజలు ఇక స్వేచ్ఛగా తిరిగేయొచ్చు. చైనాలో నిన్న కొత్తగా 62 కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. 


కాగా వుహాన్‌లోని  అతిపెద్ద మాంసపు మార్కెట్‌ కేంద్రంగా కొత్త వైరస్‌ వ్యాపించినట్లు వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంఅక్కడి అధికారులు గుర్తించారు వెంటనే వీరి శాంపిల్స్‌ను లండన్‌ను పంపించి పరిశోధనలు చేపట్టారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ వైరస్‌ను ‘కరోనావైరస్‌’గా గుర్తించారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ ఈ నగరాన్ని అతలాకుతలం చేసింది. దీంతో వైరస్‌ని కట్టడి చెయ్యడానికి లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ మహమ్మారి ఇతర దేశాలకు విస్తరించింది.మొత్తానికి ఇది    వుహాన్‌ కరొనతో ప్రపంచ్చన్ని వణికించిన తీరు ఇది.

You Might Also Like