భారత్ దేశమే శత్రువుగా ఒకటైన పాకిస్తాన్ చైనా ల మధ్య మాస్క్ ల రూపం లో  ఇచ్చిన అండర్ వేర్ లు చిచ్చుపెట్టాయి.శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా సాగుతున్న  పాక్ కు కరోనాపై పోరులో తాము అండగా ఉంటామని తమ దేశం నుంచి నాణ్యమైన ఎన్-95 ఫేస్‌మాస్కులు పంపుతామని మాటిచ్చిన చైనా లోదుస్తులతో చేసిన మాస్కులు పంపింది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా హైలైట్ చేయడం తో అది దేశ ప్రజలు చైనాపైనిప్పులు చెరుగుతున్నారు.చైనా నుంచి పాక్‌కు బామి ఇచ్చినట్లు గా దాదాపు 2 లక్షల సాధారణ మాస్కులు, 2 వేల ఎన్‌-95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2 వేల కరోనా టెస్టింగ్ కిట్లు,  2 వేల మెడికల్ సూట్లు పంపించింది.


సింధ్‌ ప్రావిన్స్‌ చేరుకున్న ఈ మాస్క్ లను ఆసుపత్రులకు సరఫరా చేశారు. చైనా నుంచి వచ్చిన బాక్సుల్లో లోదుస్తులతో చేసిన మాస్కులను చూసిన వైద్య సిబ్బంది షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పాక్‌ మీడియా ప్రసారం చేసింది. చైనా చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.కాగా ఈ వార్త నిజం కాదని పాకిస్తాన్ కు చైనా మంచి మాస్క్ లే పంపిందన్న వాదన ఒకటి ఉంది.మొత్తానికి  ఆ దేశం లోని మీడియా చైనా పంపిన మాస్క్ప లపై పరస్పర వైరుధ్య ప్రకటనలు చేయడం గమనార్హం.

You Might Also Like