ఉపాధి కోసం వెళ్లిన కార్మికులపై కరోనా పంజా విసురుతుంది.గల్ఫ్ దేశం కువైట్ లో కరోనా వైరస్ వేగం గా విస్తరిస్తోంది. ఫలితం గా ఇక్కడ గత 24 గంటల్లో కొత్తగా 77 కేసులు నమోదయ్యాయని  కువైట్   ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు ఒకరి తో ఒకరికి వ్యాప్తి చెందడం ద్వారా 77 మందిలో 74 మందికి కరోనా పాజిటివ్ సోకిందని ఆయన చెప్పారు. అయితే వైరస్ సోకినా  74  మందిలో 58 మంది భారతీయులే కావడం కలవర పెడుతుంది. మిగిలిన ముగ్గురిలో ఒక వ్యక్తి ఫ్రాన్స్ కు వెళ్లిన కారణంగా మహమ్మారి బారిన పడ్డారని మిగిలిన ఇద్దరికి వైరస్ ఎలా సోకిందో తెలుసుకుంటున్నామని తెలిపారు.


కువైట్ లో ఇప్పటి వరకు మొత్తం 556 కరోనా కేసులు నమోడు కాగా ఒక భారతీయుడు మృతి చెందగా  456 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 17 మంది ఐసీయూలో ఉన్నారు. 99 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకినవారిలో భారతీయులతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇరాన్ కు చెందిన వారు ఉన్నారు

You Might Also Like