లాక్ డౌన్ సందర్బంగా జనజీవనం లో మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ప్రజలందందరు  ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యారు.భారత్‌లోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా ముందే నిర్ణయించిన ఒక పెళ్లి విచిత్రంగా జరిపించి ప్రపంచం ద్రుష్టి ఆకర్షించారు మహారాష్ట్ర లోని ఓ జంట . శుక్రవారం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుక పలువురిని విస్తుపోయేలా చెయడం తో  పాటు వార్తల్లో కెక్కింది. పెళ్లికొడుకు ఒక చోట, పెళ్లికూతురు మరో చోట ఉండగా వీడియోకాల్‌లో వారి వివాహ తంతును పూర్తిచేశారు మతపెద్దలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన మహ్మద్‌ మిన్హాజుద్‌కు బీడ్‌ జిల్లాకు చెందిన ఓ యువతితో ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. అప్పుడు కరోనా ప్రభావం లేకపోవడంతో వివాహ తేదీని ఏప్రిల్‌ 3గా నిర్ణయించినట్లు పెళ్లికుమారుడి తండ్రి మహ్మద్‌ గయాజ్‌ తెలిపారు.


ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని వేడుకలు, సమావేశాలు రద్దయ్యాయి. జనాలు ఒక చోట నుంచి మరో చోటుకి  వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ పెద్దల సమక్షంలో ఇంట్లో నుంచే సదరు యువతితో వీడియోకాల్‌ ద్వారా వివాహం జరిపించారు. మరోవైపు తక్కువ ఖర్చుతో నిరాడంబరంగా ఇలా పెళ్లి జరగడం పట్ల ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని ఆ వివాహం జరిపించిన మత పెద్ద ముఫ్తీ ఉర్‌ రహమాన్‌ పేర్కొన్నారు.మొత్తానికి దేశాన్ని ఆకర్షించించిన ఈ వివాహం నువ్వక్కడా నేనిక్కడ అన్నట్లు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పెళ్లి జరుపుకున్నామన్న ఆనందం లో వధూవరులు ఉండటం విశేషం.

You Might Also Like