లైట్ లు బంద్ ఇంటి ముందు దీపాలు వెలిగించాలని  ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మరో సమస్యకు దారితీస్తుందని విద్యుత్ రంగ నిపుణులు తెలియ జేస్తున్నారు. నరేద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 5న రాత్రి 9 గంటలకు దేశ ప్రజలందరూ  ఒకే సారి లైట్లు ఆర్పితే విద్యుత్లో స్టేషన్ లపై లోడ్ పడి  ప్రాబ్లమ్స్ వస్తాయని విద్యుత్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. దేశంలో లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే పారిశ్రామిక వాడలు మూత  పడ్డాయి.దేశ వ్యాప్తంగా  పరిశ్రమలు విద్యుత్ వినియోగించకపోవడంతో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. దీనితో బాటు వాణిజ్య సంస్థలు మొత్తం లాక్ డౌన్ కారణంగా మూతపడటంతో మొత్తం విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. ఈ విధంగా ప్రతి రోజూ లోడ్ లో కేవలం 40 శాతం విద్యుత్ వినియోగం జరుగుతున్నది.


ఇప్పుడు ప్రధాని పిలుపును అనుసరించి అందరూ ఒకే సారి లైట్లు ఆర్పివేస్తే మొత్తం విద్యుత్ సరఫరా ఒక్క సారిగా నిలిచిపోయి గ్రిడ్ ఫెయి ల్యూర్ కు దారితీస్తుందని విద్యుత్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. ఒక్క సారిగా డిమాండ్ పడిపోతే గ్రిడ్ విఫలం అవడానికి అన్ని అవకాశాలూ ఉంటాయి. అందువల్ల ప్రధాని మోడీ పిలుపును అనుసరించి అందరూ లైట్లు ఆపినా కనీసం ఫ్రిజ్ లు, ఏసీలు ఆన్ లో ఉంచాలని విద్యుత్ రంగ నిపుణులు కోరుతున్నారు. గ్రిడ్ ఒక్క సారిగా కొలాప్స్ అయితే ఆసుపత్రులకు కూడా విద్యుత్ బంద్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


విద్యుత్ గ్రిడ్ ను కాపాడుకోవాలంటే ఆ సమయంలో కూడా విద్యుత్ వాడాలని ఇంజనీర్లు సూచిస్తున్నారు. ఒక్క సారిగా లోడ్ జీరోకు వస్తుంది కాబట్టి విద్యుత్ ఇంజనీర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని నేడు తెలంగాణ ట్రాన్స్ కో తమ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. లోడ్ పూర్తిగా పడిపోతే జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని గ్రిడ్ కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారు సూచించారు.

You Might Also Like