భారత దేశం కరోనా తో పోరాడుతూ లాక్ డౌన్ లో ఉండగా దేశ సరిహద్దుల్లో సందట్లో సడేమియా లా  ఉగ్రవాదులు గుట్టుగా  జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ప్రయత్నించగా ఉగ్రవాదుల ప్రయత్నాలను  గుర్తించిన భారత భద్రతా బలగాలు కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.ప్రతిగా భారత్ సైనికులు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. 24 గంటలుగా ఆ ప్రాంతాల్లో ఆర్మీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. సౌత్‌ బత్పురలో నలుగురు ఉగ్రవాదులు, కెరన్ సెక్టార్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు ప్రకటించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడని తెలిపారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. You Might Also Like