దేశ వ్యాప్తం గా కరోనా సమస్య తీవ్రం గా ఉన్న అటు పోలీస్ లు ఇటు నక్సలైట్ లు  తమ పోరును ఆపడం లేదు.దేశంలో ఎక్కడో ఒక చోట కాల్పులు జరుపు తూనే ఉన్నారు.జార్ఖండ్ లో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు  మరణించారు. పశ్చిమ సింగభం జిల్లాలో మావోల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోగా ముందుగా నక్సలైట్లు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

You Might Also Like