1.                                                  
  2.                                                  (దుబాయ్ నుండి యామ బాబు) 
  3.                                                        ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు 
  4.                                                                  కరోనా కేసులు 2359    మృతులు 12 మంది 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి నుండి ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో దుబాయ్ ప్రభుత్వం రెండు వారాల పాటు స్వీయ నిర్బంధం అమలు చేసింది. ఈ సందర్భంగా రాత్రికి రాత్రే కఠినమైన నిబంధనలు ప్రకటిస్తూ ఉత్తర్యులు జారీ చేసింది.దింతో ప్రతినిత్యం పర్యటకులతో కళకళలాడే దుబాయ్ దేశం మొత్తం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది.కరోనా వైరస్ బాధితులు దుబాయ్ లో రోజురోజుకు ఎక్కువడంతో ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైంది.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వ అనుమతులతో బయటకి రావాల్సిందిగా హుకూం జారీ చేసింది.

ప్రజలకు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు కలగకుండా సూపర్ మార్కెట్లు,దవాఖానాలు,మరి కొన్ని ఇతర వ్యాపార సంస్థలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 8గంటల నుండి రాత్రి 8 గంటల లోపే తమకు అవసరమున్న సరుకులను తీసుకోవాల్సింది తెలియజేశారు.రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా బయటకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.అలాగే ప్రజల కోసం పనిచేసే కొన్ని ముఖ్యమైన వ్యాపార కంపనీల ఉద్యోగులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకే పని చేసుకోవాల్సిందిగా నిబంధనలలో పేర్కొన్నారు.

రవాణా పరంగా కేవలం టాక్స్ లు మాత్రమే నడుపుతున్నారు మెట్రో రైలు ను పూర్తిగా రద్దు చేశారు ఆర్టీఏ బస్సులు కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే కొద్ది సమయం నడుపుతున్నారు ఎవరైనా వ్యక్తిగత లేదా ఉదోగ్యం రీత్యా బయటకి రావాల్సి వస్తే దుబాయ్ పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోని ఉండాలని పోలీస్ అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు.లేనియెడల భారీ ట్రాఫిక్ జరిమానాలు విదిస్తున్నారు.ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండి స్వీయ నిర్బంధం పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు.

ఇప్పటి వరకు దుబాయ్ లో 2359 కరోనా కేసు లు నమోదు కాగా వాటిలో 186 మంది కొలుకున్నారు 12 మంది కరోనా వైరస్ తో చనిపోయారు ఇక స్వీయ నిర్బంధం ఆనంతరం ఈ నెల 15 తర్వాత దుబాయ్ నుండి ఇండియా ,పాకిస్తాన్ దేశాలకు విమాన ప్రయాణాలు కల్పించనున్నట్లు ఫ్లై దుబాయ్ విమానయాన సంస్థ  వెల్లడించింది .స్వదేశానికి వెేళ్లవల్సిన వాళ్ళు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకొని 15 తేది తర్వాత వెళ్ళవచ్చని  తెలిపింది.ప్రజల సంరక్షణ కోసం దుబాయ్ ప్రభుత్వ అధికారులు రాత్రిబవళ్ళు కంటికి కునుకు లేకుండా తమ కర్త్యవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.

ముఖ్యంగా పోలీస్ లు పారిశుధ్య కార్మికులు, వైద్యులు, నర్సులు,సామజిక సేవకులు ఇతర ప్రవేట్ వ్యాపార సంస్థల అధికారులు చాల కష్టపడుతున్నారు.కరోనా వైరస్ రోజురోజుకు విజృభింస్తుండటంతో ప్రజలు ఒకవైపు భయాందోళన చెందుతున్న దుబాయ్ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న శ్రద్ధను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.తమ సంరక్షణ కోసం దుబాయ్ ప్రభుత్వం ఉందంటూ ధైర్యంగా ఉంటున్నారు


You Might Also Like