కరోనా వైరస్ ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తం గా లాక్డౌన్ ప్రకటించిన నేపత్యం లో ప్రజలకు మోడీ సర్కార్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ స్కీమ్ పేరిట  లక్ష డెబ్భై వేళా కోట్ల రూపాయల తో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.గురువారం  దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ముఖ్యం  కరోనా లాక్ డౌన్  తో పేదలు ఆకలి చావులతో  అలమటించకూడదనే ఉద్దేశ్యం తోనే  గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆమె  చెప్పారు. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు.

పేద కార్మికులను ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టామని,శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్‌, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.15లక్షల చొప్పున ప్రత్యేక బీమా  సదుపాయం కల్పిస్తున్నట్లు ఆమె  వెల్లడించారు. ‘ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తామని ఈ పథకం ద్వారా  రానున్న  మూడు నెలలకు ఒక్కొక్కరికి నెలకు రూ.5కేజీల బియ్యం పంపిణీ,ఒక కిలో పప్పు అందిస్తామని బియ్యం లేదా గోధుమలు ఈ రెంటిలో  ఎదో ఒకటి ప్రజలు ఎంపిక చేసుకోవచ్చని  ఆమె తెలిపారు.ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం అందిస్తామని వారి బ్యాంకు  ఖాతాలోకి ఈ డబ్బు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.రైతులకు తక్షణమే రెండు వేలు, వికలాంగులకు,వృద్దులకు వితంతువులకు  వెయ్యి రూపాయలు అందజేస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం లో సీతారామన్ కు తోడుగా మినిస్టర్ ఫర్ స్టేట్ అనురాగ్ ఠాకూర్ పాల్గొని కొన్ని వివారాలు ప్రకటించారు.

You Might Also Like