లాక్ డౌన్ నేపత్యం లో  యజమాని పనికి నిరాకరించడం తో ఎనిమిది నెలల గర్భిణీ స్త్రీ తన భర్త తో కలిసి 100 కిలోమీటర్ల పైన తినడానికి  తిండి కూడా లేని పరిస్థితుల్లో నడుస్తూ ఉండగా పోలీస్ లు వారించినా ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ వద్ద జరిగింది.యు.పి లోని బులంద్‌షహర్ వద్ద సయానాలో యాస్మిన్ ఆమె భర్త వకిల్ లు ఓ ఫ్యాక్టరీ లో పనిచేసేవారు.లాక్ డౌన్ నేపత్యం లో  ఫ్యాక్టరీ పనులు ఆపివేయడం తో యజమాని వారికి పనిని,డబ్బులను ఇవ్వడానికి  నిరాకరించడం తో పాటు అతను కల్పించిన వసతిని కూడా ఖాళీ చేసి వెళ్ళవల్సిందిగా ఆదేశించడం తో తమ స్వస్థలానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆ దంపతులు.

అలా వారు సహారాన్‌పూర్ నుండి మీరట్ కు 100 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ  ఆహారం లేకుండా ప్రయాణించారు.ఇది గమనించిన స్థానికులు ఆమె ను వారించి ఆమె భర్తకు మీరట్‌లో డబ్బు మరియు అంబులెన్స్ ఇచ్చి  సహారాన్‌పూర్ నుండి బులంద్‌షహర్‌కు వెళ్లేందుకు సహకరించారు.నవీన్ కుమార్ మరియు రవీంద్ర అనే వ్యక్తులు  మీరట్లోని సోహ్రాబ్ గేట్ బస్ స్టాండ్ వద్దకు చేరుకున్నప్పుడు, నడుస్తూ అలిసిపోతున్న గర్భిణిని చూసి  వారి సమస్య ను  నౌచండి పోలీస్ స్టేషన్ సబ్  ఇన్స్పెక్టర్ ప్రేంపాల్ సింగ్కు తెలియ జేశారు.


నౌచండి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అశుతోష్ కుమార్ మాట్లాడుతూ  సింగ్ మరియు అక్కడి నివాసితులు ఈ జంటకు ఆహారం మరియు కొంత నగదును ఇచ్చారు, అంబులెన్స్‌ను వారి  గ్రామానికి పంపించడానికి ఏర్పాట్లు చేసమని రెండు రోజుల పాటు తన భార్యతో 100 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడం బాధాకరమని అన్నారు.తమ యజమాని నిరాకరించడం తో చేతులో డబ్బులు లేక స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యామని అయితే దారిలో అన్ని బంద్ ఉండటం తో రెండు రోజుల పాటు ఎలాంటి ఆహారం లేక మంచి నీటి తోనే కలం వేళ్ళ దేశస్తు నడిచామని యాస్మిన్ వకీల్ దంపతులు తెలిపారు.

ఇది ఒక యాస్మిన్ వకీల్  ల సమస్య కాదు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి  ప్రకటించిన మూడు వారాల లాక్డౌన్ లక్షలాది మంది వలస కూలీలను నిరుద్యోగులుగా మార్చింది మరియు తమను తాము కాపాడుకోవటానికి ఎటువంటి మార్గాలు లేకపోవడంతో వందలాది కిలోమీటర్లు తమ గ్రామాలకు నడక సాగిస్తూనే ఉన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని చూసి ఆదుకోవాలని,లేక అధికారులకు సమాచారమివ్వాలని ఈరోజు దిన  పత్రిక విజ్ఞప్తి చేస్తుంది.

You Might Also Like