లాక్ డౌన్ వేళ కూడా భారత్ పై పాకిస్తాన్ తన ప్రతీకారేచ్ఛ మానడం లేదు.సందు దొరికితే చాలు కాల్పులతో కవ్విస్తూ భారత సైన్యాన్ని మట్టుపెట్టుతున్నారు.పాకిస్తాన్ చర్యలను ఓపిగ్గా భరిస్తున్న భరత్ ఊరుకుంటే నెత్తి కెక్కురుందని  భావించిన భారత్ ఏకంగా ఆ దేశానికి  చెందిన ఆయుధాగారాన్ని ధ్వంసం చేసి తమతో పెట్టుకోవాడాని హెచ్చరికలు జారీ చేసిందివివరాల్లోకి వెళితే  జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఎలాంటి హెచ్చరికలు  లేకుండానే, కాల్పులు జరిపి, ఐదుగురు ప్రత్యేక దళ సైనికులను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. భారత సరిహద్దుల నుంచి బోఫోర్స్ గన్స్ ను వినియోగించిన సైన్యం, పాక్ కు చెందిన ఆయుధాగారాన్ని ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియోను సైన్యాధికారులు విడుదల చేశారు.ఈ వీడియోలో పలుమార్లు పేలుడు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వున్న టెర్రర్ లాంచ్ పాడ్స్, పన్ పొజిషన్స్, ఆయుధాలను దాచివుంచిన కేంద్రాలపై దాడులు జరిపినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. అనుకున్న లక్ష్యాన్ని భారత గన్స్ ఛేదించాయని తెలిపాయి.దీని తో సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకుంది.

You Might Also Like