విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులు తమను స్వదేశాని తీసుకు వెళ్ళమని అభ్యర్థిస్తుండగా వారిని తరలించేందుకు ప్రభుత్వం సిద్దమయింది.లాక్ డౌన్ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోనుంది. వేల సంఖ్యలో అరేబియా దేశాల్లో ఉండిపోయిన భారత పౌరుల కోసం భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకలైన ఐఎన్ఎస్ జలాశ్వ మరియు మరో రెండు 3క్లాస్ ఉభయచర నౌకలను సిద్ధం చేసింది. అయితే ఇప్పటికే ఈ నౌకలు సముద్ర జలాల్లో సిద్ధంగా ఉండి, ప్రభుత్వ అనుమతులు కోసం ఎదురు చూస్తున్నాయి.కొంత అంది గర్భిణులు కూడా విదేశాల్లో ఉండగా వారు స్వదేశానికి రావడానికి ఇష్ట పడుతుండగా ప్రభుత్వం తీసుకోనున్న ఈ నిర్ణయం వారిలో సంతోషం నింపుతుంది.

You Might Also Like