లాక్ డౌన్ నేపత్యం లో ఇంటికే పరిమితమైన మీరు ఒక విషయాన్ని గమనించి చెప్పగలరా ?లాక్ డౌన్అమలు అవుతున్న సమయం లో  మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కాకులను చూసారా?అది కావ్ కావ్అంటూఅరవడం విన్నారా విని ఉండరు ఎందుకంటే ఇంట్లో ఉన్న మీరు టీవీ కో పుస్తకాలకు పిల్లలకు ఎం కావాలో చూడాటానికో ఇల్లు సర్దే పనిలో బిజీ గా ఉంది ఈ విషయాలను పట్టించుకోకపోవచ్చు అయితే ఇక పట్టించు కొండి.ఒక సారి బయటకు వెళ్లి కాకులు ఉన్నాయా లేదో చూసి రండి.

ఎందుకంటే తమిళనాడులోని పనపాక్కం సమీపంలో కాకులు పెద్దఎత్తున మరణిస్తూ ఉండటంతో కారణాన్ని కనుగొనేందుకు ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడికి సమీపంలోని పన్నియార్ గ్రామంలోని కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1న దాదాపు 10కి పైగా కాకులు ఒకేసారి మరణించాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ప్రజలు బయటకు రాకపోవడంతో ఆహారం లేక కాకులు మరణించి వుంటాయని తొలుత భావించారు.

ఆపై నిత్యమూ నివాస గృహాలపై నీరసంగా కనిపిస్తున్న కాకులు, ఒకదాని తరువాత ఒకటి అకస్మాత్తుగా మరణిస్తూ ఉండటం, మృతి చెందిన కాకుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాకులకు కరోనా వైరస్ సోకిందని, అందుకే ఇవి మరణిస్తున్నాయని మరికొందరు భయపడుతూ ఉన్నారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారుల బృందం, కాకుల మరణానికి కారణాన్ని అన్వేషించేందుకు రంగంలోకి దిగింది. అయితే ఒక్క తమిళనాడు లోనే కాదు దేశ వ్యాప్తం గా అన్ని రాష్ట్రాలలో కాకుల సంఖ్య తగ్గుతుందని కరోనా వైరస్ కు అవి రోజు రోజుకు నిరసిస్తూ మరణిస్తున్నాయని మరి కొందరు అధ్యయనం చేసి చెబుతున్నారు.ఒక వేళా ఆకలితో కాకులు మరణిస్తుంటే బయటకు వెళ్లి వాటికి ఆహారం వెయ్యండి లేకుంటే అవి అంత రిస్తే పిండం పెట్టి పితృ దేవత లకు పెడితే తిని వారి సంతృప్య్హిని చూపించే  వారధి అయినా కాకులు ఇక కనపడవు.పితృ దేవతలు సంతృప్తి చెందరు.

You Might Also Like