లాక్‌డౌన్‌ను అమలుచేయాలనీ కోరుతున్నప్పటికీ దాన్ని ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారి పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.లాక్ డౌన్ అంటూ కరోనా ప్రబలుతున్నాడని చెప్పిన పట్టించుకోని ,పలుసార్లు హెచ్చరించినా అదే పనిగా రోడ్పో పైకి వస్తున్నా వారిని ఉపేక్షించ కూడదని భావిస్తున్నారు. నిషేదిత సమయం లో రోడ్ల పైకి వచ్చి సామాజిక దూరం పాటించని వారి ముఖాలపై స్టాంపులు వేయాలని నిర్ణయించినట్లు ఈ మేరకు ముఖ్యమంత్రి ఆమోదం కొరకు వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ విధానం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అమలవుతుంది.లాక్ డౌన్ సమయం లో  రహదారులపైకి వచ్చిన కొందరికి జమ్మూ కశ్మీర్‌లోని రణ్‌బీర్‌ సింగ్ పురా పోలీసులు నుదిటిపై స్టాంపులు వేశారు.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన వారికి  స్టాంపులు అధికారులు వేస్తుండగా ఈ విధానం లో 'క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించాడు' అని ఆ స్టాంపులతో మొదటి సారి చేతిపై వేసినప్పటికీ మల్లి అలాగే ప్రవర్తిస్తే ముఖంపై స్టాంపులు వేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి.ఈ స్టాంపులు 15 రోజుల పాటు ఉంటాయి.

కొందరికి చేతులపై కూడా ఈ స్టాంపులు వేస్తున్నారు.  సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పేరు కూడా రాసి ఉంటుది. దీంతోకాశ్మీర్ రాష్ట్రంతో పాటు ఇంత రాష్ట్రాల పోలీసులు కూడా ఇదే తీరుతో ఉల్లంఘనదారులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. తెలంగాణ తో పాటు అన్ని రాష్ట్రాలలో లాక్ సీఓన్ పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుండగా ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You Might Also Like