క‌రోనాతో ఏర్ప‌డిన నిరాశ నుంచి ఆశ వైపు ప్ర‌జ‌ల్ని తీసుకువెళ్లేందుకు , క‌రోనాతో ఏర్ప‌డిన అంధ‌కారాన్ని పోగొట్టి  దివ్య వెలుగుల్ని ప్ర‌స‌రింప‌ చేయడానికి దేశం లోని 130 కోట్ల మంది భారతీయులు ఏప్రిల్ 5 రాత్రి  9 గంటలకు జ్యోతులు వెలిగించి 9 నిముషాల పాటు తమ నివాసాల ముందు నిలబడాలని మోడీ పిలుపునిచ్చారు.ప్ర‌ధాని మోడీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ఇచ్చిన వీడియో సందేశం లో  ప్రసంగించిన ఆయన కరోనాపై పోరాటంలో మనం ఒంటరులం కామని చాటాలన్నారు. కరోనాపై పోరాటంలో భారత్ విజయం సాధిస్తుందని మోడీ చెప్పారు.

కరోనాపై పోరాటంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలన్నారు. వచ్చే పదకొండు రోజులూ అత్యం కీలకమని, ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాలని చెప్పారు.  30 కోట్ల మంది ప్రజలు ఒక్క తాటిపై నిలిచి 9 నిమిషాల పాటు జ్యోతులు వెలిగించి సమిష్టిగా సందేశాన్ని ఇద్దామని అన్నారు. కరోనాపై విజయానికి నాందిగా దీనిని జరపాలని అన్నారు.

130 కోట్ల మంది ప్ర‌జ‌ల సామూహిక శ‌క్తి ప్ర‌తి ఒక్క‌రిలో క‌నిపించింద‌న్నారు. దేశ‌మంతా ఒక్క‌టై క‌రోనాపై పోరాటం చేసింద‌న్నారు.  కోట్లాది మంది ప్ర‌జ‌లు ఇండ్ల‌ల్లో ఉన్నార‌న్నారు.  ఏప్రిల్ 5వ తేదీన‌ 130 కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌హాశ‌క్తి జాగ‌ర‌ణ చేయాల‌న్నారు. దేశ ప్ర‌జ‌లు మ‌హాసంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో లైట్లు బంద్ చేసి దీపాల‌ను వెలిగించాల‌న్నారు. కేవ‌లం 9 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించాల‌న్నారు. టార్చ్‌లైట్ అయినా దీపం అయినా వెలిగించాల‌న్నారు. ఆ ప్ర‌కాశంతో అంధ‌కారాన్ని పార‌ద్రోలాల‌న్నారు. మేం ఒంట‌రిగా లేమ‌న్న సందేశాన్ని వినిపించాల‌న్నారు. ఎవ‌రూ కూడా రోడ్ల‌పై వెళ్ల‌కూడ‌ద‌న్నారు. సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించ‌కూడ‌ద‌న్నారు. క‌రోనావ్యాప్తిని  బ్రేక్ చేసేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు

You Might Also Like