ప్రధాని మోడీ మరో పిలుపు నిచ్చారు.అయితే ఈ సారి ప్రజలకు కాకుండా పార్టీ కార్యకర్తలకు ఈ పిలుపు ఇవ్వడం అందులోను ఒక పూట భోజనం మానేయమని కొందరం విశేషం. ప్రధాని మోదీ కరొనపై పోరుకు భారతీయులంతా ఏకతాటిపై ఉండాలని కోరుతూ తాళి భాజయియే ధీప్ జాలాయియే  అనే రెండు పిలుపులు ఇవ్వగా దేశం మొత్తం ఒక్కటై ఆ కార్యక్రమాలను విజయవంతం చేశారు. సోమవారం తాజాగా భాజపా కార్యకర్తలకు మరో టాస్క్‌ ఇచ్చారు మోడీ.  భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు.

పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని.. వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు అదే సందర్భం లో కరోనా పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని అయన అభ్యర్థించారు.బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా కూడా కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని సూచించారు. లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలపాలన్నారు. ఈ రోజు ఒక పూట భోజనం మానేయడంతో పాటు ‘ఫీల్ ద నీడ్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రతి  కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని కోరారు.పై రెండు కార్య క్రమాలంటే భౌతికం గా ఉండగా ఆకలి శరీరానికి సంబందించిందవటం తో కార్య కర్తలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

You Might Also Like