మోడీ ప్రకటించిన లాక్ డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తుండగా ఆ తరువాత లాక్ డౌన్లను ఎత్తివేసే దిశగా మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే  లాక్డౌన్ లేదని బయట సభలు సమావేశాలు గుంపులుగా ఉండకుండా కొన్ని షరతులతో ఈ లాక్ డౌన్ ఎత్తివేసేందు కు ప్రణాళిక ర్తయారు చెస్తూన్నట్లు తెలుస్తుంది.  కరోనా  వైరస్ పై గురువారం  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ కరోనా వైరస్ ను తరిమేసేందుకు వ్యూహాన్ని ఆలోచించి, దాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యా నించారు . ఇదే సమయంలో సామాజిక దూరం, పెద్ద పెద్ద సభలు, సమావేశాలపై నిషేధం ఉంటుందని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ , తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకునే వీలును కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని మోదీ తన మనసులోని మాటను సీఎంలతో పంచుకున్నట్టు తెలుస్తోంది.


దీంతో 15 తరువాత లాక్ డౌన్ ఉండే అవకాశాలు అంతంతమాత్రమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారిపై మరో పది రోజుల పాటు సాగనున్న లాక్ డౌన్ పోరాటం తరువాత, ఇండియాలో కేసుల పరిస్థితి, వైరస్ విస్తరిస్తున్న తీరుపై ఓ అవగాహన వస్తుంది. దాన్ని బట్టి, 10వ తేదీ తరువాత కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఇక ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం మీడియాకు ప్రెస్ రిలీజ్ ను విడుదల చేసిన ప్రధాన మంత్రి కార్యా లయం, వైద్య ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేసింది. వైద్య పరికరాలు, ఔషధాలు తయారు చేసే సంస్థలకు అవసరమైన రా మెటీరియల్ సరఫరా సక్రమంగా సాగుతోందని పేర్కొంది. అనుమానిత కేసులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా వ్యవహరించాయని పేర్కొంది.


ఇదిలావుండగా, రేపు ఉదయం తాను జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఈ ప్రసంగంలోనే లాక్ డౌన్ పైనా, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా తదుపరి 12 రోజుల్లో తీసుకోనున్న చర్యలపైనా ఆయన మాట్లాడతారని సమాచారం.మొత్తానికి మోడీ ౧౫ తరువాత లాక్ డౌన్ ఎత్తివేసేలా నిర్ణయం తీసుకునేలా కనిపిస్తుండగా అదే జరిగితే బందీలై ఉన్నట్లు భావిస్తున్న ప్రజలు ఆనందం లో తేలియాడే అవకాశముంది.మరో వైపు మోడీ లాక్ డౌన్ సత్పలితాలిచ్చినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ ఆయనను అభినందిస్తూ ప్రపంచం లోని అన్ని దేశాలు ఆయనను అనుసరించాలని కోరడం ప్రశంసనీయం.


You Might Also Like