దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ ప్రభుత్వం కోత విధించింది. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత విధించాలని నిర్ణయించారు.


అలాగే రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్‌ నిధులు నిలిపివేయాలని నిర్ణయం​ తీసుకున్నారు. కన్సోలిడేట్ ఫండ్ కింద రూ.7వేల 900కోట్లు ఎంపీల్యాడ్స్ స్కీం నుంచి ప్రభుత్వానికి అందుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ తెలిపారు. కాగా లాక్ డౌన్ ప్రకటించడంతో భారత ఆర్థిక వ్యవస్థపై పై తీవ్ర ప్రభావమే పడింది.1954 చట్టాన్ని సవరించారు. ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ ఈరోజు మీడియాకు వివరించారు.

ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘కరోనా’ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ వేతనాల్లో కోతకు వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు.మొత్తానికి  జీతాల్లో కోత విధించి దానిని ప్రభుత్వ నిధులకు జోడించాలని గవర్నమెంట్ యోచిస్తోంది.

You Might Also Like