కరోనా వైరస్ అమెరికాలో కరాలా నృత్యం చేస్తుంది. వైరస్ దెబ్బకు  ఆ దేశంలోని వందలాదిమందిప్రాణాలను కోల్పోతున్నారు. వ్యాధి తీవ్రత రోజురోజుకు పెరుగు తుండటం తో నిన్న ఒక్క రోజే ఏకంగా 1100 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24  గంటల్లో ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 630 మంది మృతి చెందారు. అంటే ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున గంటకు 25  మంది చనిపోతుండటం ఆదేశ ప్రజల్ని కళవర పెడుతుంది.మరో వైపు పెరుగుతున్న మరణాలకు ఒక్క సారిగా తాము అంత్య క్రియలు చేయలేమని శవాలని మార్చురీలలోనే భద్ర పర్చాలని స్మశాన నిర్వాహులు చెబుతుండగా మృతుల కుటుంబ సభ్యులు ఎం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు.

You Might Also Like