గత కొంత కాలం గా అనారోగ్యం తో ఉన్నాడని కొందరు చనిపోయాడని ప్రచారం జరిగిన నేపత్యం లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బతికే ఉన్నాడని సౌత్ కొరియా స్పష్టం చేసింది.  కిమ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందంటూ ఆయన సర్జరీ ఫెయిల్ అయి బ్రెయిన్ డెడ్ అయ్యిందంటూ వార్తలు వస్తున్న తరుణంలో సౌత్ కొరియా క్లారిటీ ఇచ్చింది. సౌత్ కొరియా ప్రెసిడెంట్ విదేశీ వ్యవహారాల అడ్వయిజర్ గా ఉన్న మూన్ చుంగ్ ఇన్ మాట్లాడుతూ కిమ్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.అయన  సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   కిమ్ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అనుమానాస్పద కదలికలు తమకు కనిపించలేదని ఆయన చెప్పారు. ఏప్రిల్ 13 వ తేదీ నుంచి వాన్ సన్ లో కిమ్ ఉంటున్నారన్నారు. కొన్ని సార్లు అలా మౌనం ఆ ఉండటం కిమ్ కు అలవాటేనని అయన చెప్పారు గతం  లో కూడా ఒకటి  రెండు సార్లు కిమ్ ఇలా కనపడకుండా ఉంది రెస్ట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయని అలాగే ఇప్పుడు కూడా  జరగవచ్చని ఆయన చెప్పారు.

You Might Also Like