అక్కడ మతం మార్చి బాలికలను నిర్బంధించి తాత తండ్రి వయసు ఉన్నవారితో   పెళ్లిళ్లు చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నారు.పాకిస్థాన్ లో హిందువులపై  హిందూ మహిళలు, మైనర్ అమ్మాయిల పై  అఘాయిత్యాలు నిత్యం కొనాసాగుతూనే ఉన్నాయి.మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి, ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చేస్తు  ఆ అమ్మాయిలకు ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.అది ఆ అమ్మాయిలకు తాత వయసు ఉన్నవారితో బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లో పద్నాలుగేళ్ల మైనర్ హిందూ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి కొంత మంది పాకిస్థానీయులు మతం మార్చారు .

ఆ అమ్మాయిని 40 ఏళ్ల మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తికిచ్చి వివాహం చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు పాక్‌ సోషల్ మీడియాలో చెక్కెర్లు కొడుతున్నాయి. మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తి, సదరు మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు.మైనర్ బాలికలపై దాడులను కొనసాగిస్తున్న పాకిస్తాన్ ముస్లింల  వైఖరి పై  పాక్‌ మైనార్టీ సంఘాలు భగ్గుమంటున్నాయి. చిన్న వయసు బాలికలపైనే కాకుండా యువతులపై దాడులను ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా భారతీయుల పట్ల పాకిస్తాన్ వైఖరి అలాగే కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తుంది

You Might Also Like