కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్రాలలో  21 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగుతోందని,లాక్ డౌన్ ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ వంటిదని, ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తాయని, ప్రతి నగరం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి వీధి లాక్ డౌన్ తప్పదని తెలిపారు.ఈ సందర్బంగా ఏవరు ఇల్లు దాటొద్దని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్ డౌన్ నియంత్రణను ప్రతి ఒక్కరూ తమ ఇంటి లక్ష్మణ రేఖగా భావించాలని మోడీ అన్నారు.  ఆయన ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకూడదన్నారు.

రోడ్లపైకి రావడాన్ని నిషేధిస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇటలీ నిర్లక్ష్యం వల్ల ఆ దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా యని చెప్పారు. దేశ ప్రజల ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను పాటించాలని మోడీ అన్నారు.ఈ లాక్ డౌన్ నిర్ణయం లక్ష్మణరేఖలా జనాలను కాపాడు తుందని, 21 రోజుల లాక్ డౌన్ మన ప్రాణాల కంటే ఎక్కువేం కాదని అన్నారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మన చేతుల్లో ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ఇది ఎంతో కఠిన నిర్ణయం అయినా, ఎంతో నష్టం తప్పదని తెలిసినా ప్రజాసంక్షేమం దృష్ట్యా తీసుకోకతప్పడంలేదని తెలిపారు. 24 గంటలు పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దామని సూచించారు. మోడీ ఇది ప్రధానిగా తన ఆదేశం, సందేశం మాత్రమే కాదనీ, మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్న మాట అని చెప్పారు.

You Might Also Like