వద్దన్నా వినకుండా నిజాముద్దీన్ సమావేశాలు నిర్వహించి పరారీలో ఉన్న తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీని కనుగొని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జమాత్ సమావేశం నిర్వహించి, దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిచెందాడానికి  కారణమైన జమాత్ చీఫ్ సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇన్ని రోజులు ఆయన పరారీలో ఉన్నారు. ఢిల్లీలోని జాకీర్ నగర్ ప్రాంతంలోని తన నివాసంలో మౌలానా సాద్ క్వారంటైన్‌లో ఉండగా ఢిల్లీ పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో మౌలానా కోసం ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు తీవ్రంగా గాలించారు.

You Might Also Like