ప్రార్థనలు చేస్తారా ఒక్క సారి కాదు రోజుకు ఐదు సార్లు చేయండి కానీ సామాజిక దూరం పాటిస్తూ మీ విశ్వాసాన్ని మీరు పాటించండి మీ కొచ్చింది భయంకరమైన  కరోనా వ్యాధి ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలి మీరు వ్యాధి నుండి బయట పడి ఆరోగ్యవంతులుగా తిరిగి మీ ఇంటికి వెళ్లి మీ కుటుంబ సభ్యులతో అనందం గా ఉండాలని అక్కడి వైద్యులు సిబ్బంది  ఎంత బ్రతిమిలాడినా వారు వినడమే లేదట పైపెచ్చు తమపైనే దాడులకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది అధికారులకు పిర్యాదు చేస్తున్నారు.ఇది ప్రస్తుతం హైదరాబాద్ లోని  గాంధీ  ఆసుపత్రిలోని పరిస్థితి.

కరోనా వైరస్ పాజిటివ్ తో గాంధీ ఆసుపత్రిలో చేరిన పేషంట్లు వైద్యులు చెబుతున్న  కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలోని మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా వ్యాధి సోకగా వీరందరిని గుర్తించిన ప్రభుత్వం గాంధీ ఆసుపత్రికి వైద్య సేవలు అందించేందుకు తరలించింది.

ఆసుపత్రిలో  ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు సిబ్బందికివారు ఏ మాత్రం సహకరించడం లేదు. వైద్యులు చెప్పిన ఏ విషయాన్నీ వారు సీరియస్ గా తీసుకోవడం లేదు. కరోనా వచ్చిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించాలి. పక్క నున్న వ్యక్తి కూడా కరోనా పేషెంటే అయినా వారి మధ్య సామాజిక దూరం పాటించాలి.

అలా దూరం పాటిస్తే ఎవరికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందో వారు బతికే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కరోనా వచ్చింది కదా అని అందరు ఒకే చోట చేరితే వ్యాధి ముదిరి అందరి ప్రాణాలమీదికి వస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని డాక్టర్లు పడే పడే చెబుతున్నా కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు వినడం లేదు.గుంపులు గుంపులుగా వారు నమాజు చేస్తున్నారు. వద్దన్నా వినకుండా ప్రవర్తిస్తున్న వీరిని ఏం చేయాలో అర్ధం కాక వైద్యులు తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.ఉన్నతాధికారులు ఎప్పటి  కప్పుడు ఈ విషయాలను  ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.ఏది ఏమైనా ప్రార్థనలు చేయడం వారి మత విశ్వాసం లో భాగం కాగా ప్రార్థనలు చేయడం ఎవరు వద్దనడం లేదు అయితే ప్రస్తుతం వారి ఆరోగ్యం కాపాడుకోవడం బ్రతికి బయట పడటం కూడా వారికి ఇంపోర్టంటే అయినందున వారు వైద్యులు చెప్పినట్లు నడుచుకోవాలని కొందరు ప్రజలు కోరుతున్నారు.లేకుంటే వారికి ప్రత్యేక గదులు కేటాయించి వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. 

You Might Also Like