మసీద్ లో దాక్కున్న తబ్లిగి జమాత్ సభ్యులకు ఆహార పొట్లాలను అందిస్తుండగా పోలీసులు నిఘా పెట్టి మరి పట్టుకున్నారు.పోలీస్ లకు భయపడో  లేక వైద్య పరీక్షలకు జడసో  తబ్లిగి జమాత్ సభ్యులు లక్నోలోని ఆర్మీ కంటోన్మెంటులోని సదర్ బజార్‌లో ఉన్న అలీజాన్ మసీదులో  దాక్కున్నారు.మసీద్ నిర్వాహకులు వీరికి ఆహారం అందించేందుకు గుట్టుగా ఏర్పాట్లు చేశారు కూడా.అయితే మసీద్ లోకి పెద్ద ఎత్తున ఆహార పొట్లాలు సరఫరా అవుతుండడంతో అనుమానించిన కొందరు వ్యక్తులు మిలటరీ ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందించారు.

నిఘా వేసిన అధికారులు మసీదులో తబ్లిగి జమాత్ సభ్యులు దాక్కున్నట్టు నిర్ధారించుకుని విషయాన్ని పోలీసులకు చేరవేశారు.దీంతో మసీదుపై దాడిచేసిన పోలీసులు 14 మంది తబ్లిగి జమాత్ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరంతా షహరాన్‌పూర్ గ్రామానికి చెందిన వారని, ఢిల్లీలోని మర్కజ్  మసీదు సమావేశానికి హాజరై వచ్చి మసీదులో దాక్కున్నట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. పట్టుబడిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. వీరందరిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


షాక్ ఐయ్యే విషయం  ఏమిటంటే ఇక పట్టుబడిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది. వారు మసీదులో ఉండగా వీరికి చికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ ఆసిఫ్‌ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసీదును శానిటైజ్ చేశారు. మసీదులో దాక్కున్న తబ్లిగి సభ్యులు చుట్టుపక్కల బజార్లలో పండ్లు, కూరగాయలు కొన్నట్టు తేలడంతో వైద్యాధికారులు వారిని కూడా పరీక్షిస్తున్నారు.ఇప్పుడు వారి ద్వారా ఎంత మందికి వైరస్ సోకిందని విషయం పై ఆరా తీస్తూ వారందరిని నిర్బందించేందుకు పోలీస్ లు తీవ్రంగా యత్నిస్తున్నారు.

You Might Also Like