కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో మృత్యు తాండవంచేస్తుంది.కొన్ని రోజులుగా అమెరికాలో రోజుకు సగటున 2వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెరసి తమ దేశ పౌరులు కుప్పలుగా ప్రాణాలొదిలేస్తున్న అమెరికా ఎం చేయలేకపోతున్నామని బాధతో విలవిలా లాడుతుంది.ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధికంగా ఇటలీలో 19,468 కరోనా మరణాలు చోటుచేసుకోగా ప్రస్తుతం అమెరికా ఈ సంఖ్యను దాటేసింది. అమెరికాలో మొత్తం 20,506 మంది కరోనా వైరస్ మహమ్మారికి బలయ్యారు. బాధితుల సంఖ్య కూడా 532, 300గా నమోదయ్యింది.శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లోనే 2,108 మంది చనిపోయారు. అలాగే, శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,920 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. దీంతో అమెరికాలో కోవిడ్-19 మరణాలు 20వేల మార్కును దాటాయి. 


న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితులు మారీ దారుణంగా ఉన్నాయి. న్యూయార్క్‌లోని వివిధ నర్సింగ్‌ హోమ్స్‌లో ఉన్న దాదాపు 2 వేల మంది వృద్ధులు, రోగులు కరోనా మమహ్మారితో మృత్యువాతపడ్డారు. మరోవైపు, అమెరికాలో ఉంటున్న భారతీయులు, భారతి సంతతికి చెందిన సుమారు 40 మంది కరోనా వైరస్‌తో మృతిచెందారు. మరో 1,500 మందికి కొవిడ్‌-19 సోకింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఇద్దరు, కేరళకు చెందిన 17 మంది, ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు అమెరికాలోని భారతీయ సంఘాలు వెల్లడించాయి. మృతుల్లో 21 ఏళ్ల వయసు యువకుడు మినహా మిగతా వారంతా 60 ఏళ్లు పైబడినవారేనని వారు తెలిపారు.

You Might Also Like