హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే అది తనను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని ప్రతిగా తాము ప్రతీకారం దిశగా ఆలోచిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. సోమవారం శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ అమెరికాతో భారత్‌ ఎప్పుడూ సత్ సంబంధాలే కోనసాగిస్తుందని తాము కోరినట్టు  ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే మోడీ  నిర్ణయమైతే అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు.

ఆదివారం మోడీ తో మాట్లాడాను క్లోరోక్విన్‌ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయక సరఫరా చేయకపోతే  ప్రతీకారం దిశగా తాము వెళతామని ఔను ఎందుకు వెళ్లకూడదని అయన విలేకరులను ఎదురు ప్రశ్నించాడు.?’’ అని మరోవైపు ఔషధ రంగంలో అమెరికాకు భారత్‌ సుదీర్ఘకాలం నుంచి ప్రధాన భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోందని యూఎస్‌ విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి అలైస్‌ జీ వెల్స్‌ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరికొన్ని దేశాల నుంచి కూడా భరత్ కు విజ్ఞప్తులు వస్తున్నాయి. మరోవైపు భారత్‌లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ఉనికిని విస్తరిస్తూ పోతోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాల్లో వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యూహాత్మక ఔషధ నిల్వలు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ ఎలా వ్యవహరించ బోతుందో

You Might Also Like