ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన ఇది.మృతులు అనంతపురం జిల్లాకు చెందిన వంశీ కొండి గళ్ళ పేద్దింటి, కటికల  రేవంత్ కుమార్ గా గుర్తించారు. వీరు షాపింగ్ కు ద్విచక్ర వాహనం సేబు నగరానికి  పై బయలు దేరగా ఎదురుగా వస్తున్నా ఓ కారు వీరి వాహననాన్ని ఢికొట్టడం తో రేవంత్ అక్కడికక్కడే మృతి చెందగా వంశీ  తీవ్ర గాయాలతో  రెండు గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడినప్పటికీ అతనికి వైద్య సహాయం అందక పోవడం తో చనిపోయాడని  అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

అనంతపురం పట్టణానికి చెందిన వంశీ తండ్రి కెపి నారాయణ స్వామి జిల్లా  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు కాగా,రేవంత్ కదిరి పట్టణానికి చెందినవాడని తెలుస్తుంది. వారి మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు జిల్లా కలెక్టరు గంధమ్  చంద్రుడు ను కలిసి కోరగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఫిలిప్పీన్స్ లో అనేకమంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు.


You Might Also Like