అమెరికా సాయుధ బలగాలు భారత్ కు మద్దతుగా నిలవనున్నాయి.చైనా ముప్పును ఎదురుకునేందుకు

అండగా ఉండనున్నాయి.ఈ విషయాన్నీ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంప్యూ బ్రేస్సిల్స్ ఫోరమ్ 

వర్చ్యువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు.ఇటీవల జర్మనీ నుంచి అమెరికా తమ బలగాలను 

ఉపసంహరిస్తోంది.బలగాల తగ్గింపు ఎందుకన్న ప్రశ్నకు భారత్ దక్షిణాసియా కు చైనా ముప్పుగా మారడమే 

కారణమని తెలిపారు.చైనా చెర్యలు చూస్తుంటే భారత్ ను బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయనితెలిపారు 

పొంప్యూ.అలాగే వియత్నాం ఇండోనేషియా మలేసియా ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చైనా తీరు ముప్పుగా 

పరిణమించిందన్నారు పొంప్యూ.దక్షిణ చైనా సముద్రంలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయిఅన్నారు.

ఈ సవాళ్లు అన్ని ఎదురుకోవడానికి ప్రస్తుతం అమెరికా బలగాలను సరైన రీతిలో మోహరిస్తామన్నారు.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి బదులివ్వడానికి తాము అవసరమైన రీతిలో బలగాలను మోహరిస్తాం

అని స్పష్టం చేసారు.నిఘా ఎయిర్ ఫోర్స్ నేవీ ఇలా ఏ వనరులైన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం

తీస్కొని ప్రపంచవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలకు కేటాయించ వలిసివుంటుందని చెప్పారు.అందులో

భాగంగానే అమెరికా అధ్యక్షుడు జర్మనీలో బలగాలను ఉంచారన్నారు.అలాగే చైనా నుంచి ముప్పు ఉన్న

భరత్ వియత్నాం మలేసియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దక్షిణ చైనా సముద్రం వంటి చోట్లకు బలగాలను

పంపవలిసి ఉంటుందని స్పష్టం చేసారు. 


You Might Also Like