పెళ్ళాం కొంచం అందంగా లేకపోయినా ఉద్యోగం ఉంది గదా అని పెళ్లి చేసుకుని ఆమె జీతం తో కాలం వెళ్లదీస్తూ ఆ తరువాత మరో చక్కటి మహిళను ఆదరించి ఆమె తో కాపురం పెట్టి రెండు నెలలుగా భార్య ముఖం చూడని ఓ ప్రబుద్దున్ని కథ ఇది.భార్య ఉండగానే మరో మహిళా తో విహేతర సంబందం కొనసాగిస్తున్న  భర్తను అయన ప్రియురాలీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని  దేహశుద్ది చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లా పోతన నగర్ బీట్ బజార్ లో నివాసం ఉంటున్న భార్య భర్తలు తులసి,శ్రీనివాస్ వీ రికి వివాహాం అయి పది సంవత్సరాలు ఆవుతుంది.భర్త శ్రీనివాస్త కు పనిలేక ఖాళీగా ఉండటం తో తరుచు  భా ర్య భర్తలు గోడవ పడుతుండేవారని తెలిసింది.భార్య తులసి ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తుంది.భార్య సంపాదన మీద బతుకే శ్రీనివాస్ మరో సెటప్ చూసుకుని  రెండు నెలల నుండి ఆమెతోనే ఉండగా,  రెండు నెలలుగా భర్త ఇంటికి రాకపోవడంతో, ఆరా తీసిన భార్యకు అసలు విషయం తెలిసింది.

కుటుంబ సభ్యులను వెంటేసుకుని బయలుదేరింది. బీట్‌ బజార్‌లోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉన్నతన భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహం పట్టలేక వారంతా ఎడాపెడా వాయించింది. తన్నుకుంటూనే బ్రిడ్జి కింద నుండి తీసుకువెళుతు స్థానిక ఇంతజార్గంజ్ పోలిస్ స్టేషన్లో వారిద్దరిని అప్పగించారు.తనకు  న్యాయం చేయాలని భా ర్య తులసి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పోతన నగర్‌లోని బీట్‌ బజార్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.అయితే అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లుగా సదరు శ్రీనివాస్ తన భార్యకంటె ప్రియురాలివైపే మద్దతుపలకడం కొసమెరుపు.

You Might Also Like