క‌రోనా పాజిటివ్‌గా తేలడంతో త‌బ్లిగీ జ‌మాత్‌కు చెందిన ఓ స‌భ్యుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కరోనా నేపత్యం లో అతనిని ఇసోలాటిన్ వర్డ్ లో ఉంచగా శ‌నివారం ఉద‌యం ఐసోలేష‌న్ వార్డులోని బాత్రూమ్‌కు వెళ్లిన అత‌డు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.మహారాష్ట్రలోని అకోలా ఆస్ప‌త్రిలో శ‌నివారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే అసోంకు చెందిన ఓ వ్య‌క్తి గ‌త నెల ఢిల్లీలో త‌బ్లిగీ జ‌మాత్ నిర్వ‌హించిన మ‌త స‌మ్మేళ‌నంలో పాల్గొని అక్కడ అతనికి పరిచయమైనా మ‌హారాష్ట్ర‌కు చెందిన మ‌రో స‌భ్యుడితో క‌లిసి అకోలాకు వ‌చ్చాడు. పోలీసుల ఆదేశాల మేర‌కు ఇటీవ‌ల స్వ‌చ్ఛందంగా ఆస్ప‌త్రికి వెళ్లిన అతనికి  శుక్ర‌వారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఉద‌యం ఐసోలేష‌న్ వార్డులోని బాత్రూమ్‌కు వెళ్లిన అత‌డు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 

You Might Also Like